Ginger Juice Benefits : ఆరోగ్యానికి వంటింట్లో దొరికే ప్రతీ పదార్థంతోను పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా వంటింట్లో లభించే అల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అల్లంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వయసు పైబడిన వారు తరచూ బాధపడే కీళ్ల నొప్పులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
అల్లంతో ఎన్నో రకాల గుండె సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండె పోటు వంటి ప్రమాదాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు కొలస్ట్రాల్, రక్తపోటు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అందువల్ల తరచూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల శరీరంలో చాలా మార్పులు చూడవచ్చు. ఇక జీర్ణక్రియ వంటి సమస్యలను కూడా అల్లం రసంతో తగ్గించుకోవచ్చు.
అల్లం రసం తాగడం వల్ల అధిక బరువు వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఇక శరీరంలోని కొవ్వు కణాలను కూడా అల్లం రసంతో కరిగించుకోవచ్చు. మరోవైపు అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వంటి నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మరోవైపు అల్లం రసాన్ని ఆయుర్వేదంలోను ఉపయోగిస్తారు. ఇది చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
అల్లంలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచేలా చేస్తుంది. అల్లంలో ఉండే పోషకాలు శరీరాన్ని ఎటువంటి రోగాలకు గురి కాకుండా చేస్తుంది. అల్లం రసం తాగడం వల్ల శోథ నివారణ వంటి నొప్పి నుంచి కూడా నివారణ పొందవచ్చు. మరోవైపు కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణం చేసే సమయంలో వికారం వంటివి వచ్చిన వారు అల్లం రసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరోవైపు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్న వారు అల్లం రసం తాగడం వల్ల చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక అల్లం ముక్కలను డైరెక్ట్ గా తీసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. అల్లం రసంలో తేనె మరియు నిమ్మ రసం కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గించుకోచ్చు.
(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)