EPAPER

Milk Face Pack: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Milk Face Pack: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Milk Face Pack For Glowing Skin Homemade: పాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికి తెలుసు.. కానీ పాలతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా? అవును పాలతో కలిపి ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే అందం రెట్టింపు అవుతుంది. పాలలోని సహజ గుణాలు ముఖంపై మురికిని, మృతుకణాలను తొలగిస్తుంది. పాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమగా ఉండేలా చేస్తుంది. పాలలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, లాక్టిక్ యాసిడ్ వంచి గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్నిపునరుజ్జీవింప చేస్తాయి.  మీరు పాటించే స్కిన్ కేర్ రొటీన్‌లో పాలను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి పాలను ముఖానికి వాడినట్లైతే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పచ్చిపాలతో ఈ పదార్ధాలను కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీ చర్మం మిల మిల మెరిసిపోవడం ఖాయం.


పచ్చి పాలు, బాదం పప్పు ఫేస్ ప్యాక్
ముందుగా బాదం పప్పును రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత పచ్చి పాలలో బాదం పప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటమలు తగ్గిపోతాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి.

పచ్చి పాలు, తేనె ఫేస్ ప్యాక్
పచ్చి పాలల్లో తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది. మృతుకణాలు తొలగిపోతాయి. ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.


Also Read: మీకు చికెన్ వింగ్స్ అంటే ఇష్టమా? ఆ రెసిపీని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు

పచ్చిపాలు, పసుపు ఫేస్ ప్యాక్
పచ్చి పాలల్లో చిటెకెడు పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. పసుపులో ఉండే యాంటీ బయాటిక్స్ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

పాలు, అవకాడో ఫేస్ ప్యాక్
మూడు టేబుల్ స్పూన్ పాలల్లో అవకాడో గుజ్జును కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్నిముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాలు, బొప్పాయి ఫేస్ ప్యాక్
బొప్పాయి గుజ్జులో రెండు చేబుల్ స్పూన్ పాలు, టీ స్పూన్ తేనె కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

Ajwain Benefits: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

×