
Hair Straightening Machine : వేడుక ఏదైనా కానీ అందంగా తయారవ్వడం అమ్మాయిలకు ఇష్టం. అందరిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోవాలని.. ముఖానికి మేకప్ దగ్గరి నుంచి డ్రెస్సుల వరకు చక్కగా అలంకరించుకుంటారు. కానీ, వచ్చిన సమస్యంతా జడ దగ్గరే. స్టైలింగ్‌కి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. దీనికి పరిష్కారంగానే ఈ ‘హెయిర్ స్ట్రెయిట్నర్ కోంబ్ మెషిన్’ వచ్చేసింది. దీని ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
అందంగా రెడీ అయిన అమ్మాయిలకు అలంకరణకు తగ్గట్టు జడ స్టైలింగ్ లేకుంటే వేసుకున్న మేకప్ అంతా వృధా అయినట్టే మరి. చిక్కులు పడ్డ శిరోజాలను దువ్వడానికే ఎక్కువ సమయం పట్టేస్తుంది. ఇక నుంచి అలా ఆలస్యం కాకుండా ఈ హెయిర్ స్ట్రెయిట్నర్ కోంబ్ మెషిన్ నిమిషాల్లో మీకు సాయం చేస్తుంది. ఈ కోంబ్‌తో కురులను చిక్కుల్లేకుండా దువ్వడమే కాదండోయ్.. దీంతో రకరకాలుగా మీ శిరోజాలను అల్లేయొచ్చు కూడా. మీకూ నచ్చితే ఆర్డర్ చేసేయండి మరి.