
kids Food : పిల్లల ఎదుగుదలకు, వారి ఆరోగ్యానికి పోషకాలు ఉన్న ఆహారం చాలా అవసరం. కిస్‌మిస్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌తోపాటు పొటాషియం, పాస్పరస్, కాల్షియం ఎదిగే పిల్లలకు మంచి తోడ్పాటునిస్తుంది. వీటిని 8వ నెల నుంచే పిల్లలకు తినుబండారాలకు బదులు ఇవ్వొచ్చు.
బోలెడు ప్రయోజనాలు..
సాధారణంగా చిన్నారుల్లో మలబద్దకం సమస్య ఎక్కువ. ఎండు ద్రాక్షలోని ఫైబర్ పేగు కదలికలను సులభం చేస్తుంది. కిస్మిస్లను తినడంతో అజీర్తి సమస్య దరి చేరదు. మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎండు ద్రాక్షలో లభించే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులోని కాపర్ ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. చిన్నారులకు ఎండుద్రాక్ష అందించడంతో వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చురుకుదనం రెట్టింపు అవుతుంది. విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.