Omega 3 Fatty Acids: ఎంత అందంగా ఉన్న ముఖమైనా సరే.. ఒక్క మొటిమ వచ్చిందంటే.. ఆ అందమంతా పోతుంది. మనం తినే ఆహారమే ముఖంపై మొటిమలకు కారణమవుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పాటు రిఫైన్డ్ చేసిన షుగర్స్, డెయిరీ ఉత్పత్తులు, శాచురేటెడ్ ఫ్యాట్స్ కారణంగా సెబమ్, కెరాటిన్ లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అవి చర్మంపై ఉన్న వెంట్రుకుల కుదుళ్లలో బ్యాక్టీరియా పెరగటానికి కారణమవుతాయి. ఫలితంగా మొటిమలు వస్తాయి. అయితే.. కొందరికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన పోలికల వల్ల కూడా మొటిమలు వస్తాయి.
మొటిమలను తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. అంతగా ఫలితం కనిపించదు. చాలావరకూ మొటిమల సమస్య ఎదుర్కొన్నవారిలో ఒమిగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్లుగా ఓ అధ్యయనం చెబుతోంది. ఐకోసపెంటేనోయిక్ యాసిడ్ (EPA), డొకొసాహెక్సేనిక్ యాసిడ్ (DHA)లు అధికంగా తీసుకుంటే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. వీటిని కావలసిన పరిమాణంలో తీసుకుంటే.. మొటిమలు తగ్గుతాయి.
Also Read: ఈ నీటిని తాగితే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా అస్సలు ఉండలేరు..
ఆల్ఫొ-లినోలెనిక్ యాసిడ్ (ALA) జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది. కానీ.. ఇది శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. అందులే తగిన మోతాదులో EPA, DHA, ALAలను తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు పాలు, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, చిప్స్ తినేవారికి ఆహారం జీర్ణమవ్వడం ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సహజంగా లేదా మందుల ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకున్న వారిలో మొటిమలు తగ్గినట్లు అధ్యయనం చెబుతోంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)