Side Effects Of Tea – Bread: ప్రస్తుత జీవితంలో రోజూ బ్రెడ్ తినడం చాలా సాధారణం. అయితే చాలా మంది ఉదయమే టీ లేదా పాలల్లో బ్రెడ్ తీసుకుంటున్నారు. ఓ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది. ఉదయాన్నే టిఫిన్ చేయకున్నా బ్రెడ్‌తో సరిపెట్టుకోవచ్చు అనే ధోరణిలో అందరూ ఆలోచిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ టీ, పాలల్లో వేసుకొని తింటున్నారు. అయితే ఉదయమే టీ లేదా పాలల్లో బ్రెడ్ తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.
ఉదయాన్నే బ్రెడ్ తినడంతో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు.
బ్రెడ్‌లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడంతో మెదడు పనితీరు తగ్గడంతో పని ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్‌ను కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తినాల్సి వస్తుంది. అయితే ఇలాంటప్పుడు బ్రెడ్ తీసుకున్న వెంటనే ఏదైనా మంచి పండు తింటే సరిపోతుందని అంటున్నారు. రోజూ బ్రెడ్ తీసుకోకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్‌ను వాస్తవానికి మైదా, గోధుమల నుంచి తయారుచేస్తారు. వీటిలో అధిక ఫైబర్ ఉండడంతో శరీరానికి మేలు చేస్తుంది. కానీ బ్రెడ్ లో అధిక రక్తపోటుకు కారణమయ్యే సోడియం లెవల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయని అంటున్నారు.
బ్రెడ్‌ను వివిధ రూపాల్లో తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.అలాగే బ్రెడ్ సంబంధిత పదార్థాలు కేకులు, బేకరీ ఫుడ్స్, బర్గర్లు వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయని చెబుతున్నారు.
బ్రెడ్‌లో కార్భోహైడ్రెట్లు శుద్ధి చేయపడతాయి. కావున శరీరానికి ఉపయోగకరం కాదు. దీంతో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. కావున బ్రెడ్ తినకుండా ఉంటే డయాబెటిస్, గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
బ్రెడ్ అధికంగా తింటే ఉబకాయం వస్తుంది. శరీరంలో గ్లూకోజ్ రూపంలో నిల్వ ఉండడంతో పొట్ట, పిరుదులు, తొడల భాగాల్లో ఎక్కువ కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. వ్యాయామం చేస్తూ బ్రెడ్ తీసుకుంటే కొవ్వు సులువుగా తగ్గించుకోవచ్చు.
Also Read: షుగర్ పేషెంట్లు పాలు తాగొచ్చా లేదా.. నిపుణులు ఏం చెబుతున్నారు
బ్రెడ్ తయారీలో పిండిని పులియబెడతారు. ఇందులో ఉండే బాక్టీరియా ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మైదాతో తయారు చేసే బ్రెడ్ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కావున బ్రెడ్ ను రోజూ తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.