
Sugar Control Exercise : రోజు రోజుకీ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే, రక్తంలో చెక్కర స్థాయిని తగ్గించడానికి వ్యాయామం సమర్ధవంతంగా పనిచేస్తుంది. కానీ బద్దకం వల్లనో, సమయం లేకనో చాలామంది వ్యాయామం చేయలేరు. అలాంటివారి కోసమే ఈ వ్యాయామం. తక్కువ శ్రమతోనే చేయగల ఈ వ్యాయామం రక్తంలో చెక్కర స్థాయిని 50 శాతం వరకు తగ్గిస్తుందట.
సోలియస్ పుషప్స్
కుర్చీలో కూర్చొని కాలివేళ్లను నేలకు ఆన్చి కాళ్ల మడమలను పైకి లేపి కిందకు దించుతూ ఉండాలి. ఇలా లయబద్ధంగా నిమిషానికి 50 సార్లు చేయవచ్చు. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ని శక్తిగా వినియోగించుకుంటాయి. దాంతో రక్తంలో చెక్కర స్థాయి తగ్గుతుంది.
వాకింగ్ పుషప్స్
ఆఫీసు పని కారణంగా ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుని ఉండే వారికి ఈ వ్యాయామం చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. ఎక్కువ సమయం కూర్చోకుండా మధ్య మధ్యలో ఈ పుషప్స్ చేయడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గుతాయని, ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.