Cognitive Health Diet: మారుతున్న జీవనశైలి కారణంగా తరచూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. చిన్న చిన్నవే కాదు అతిపెద్ద వ్యాధులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా ఇవన్నీ చిన్న వయసులోనే వ్యాధులు సంభవించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా జ్ఞాపక శక్తి అనేది పెద్ద సమస్యగా మారింది. తరచూ అన్నీ మరచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మెదకు చురుగ్గా ఉండాలంటే దానికి తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మెదడు చురుగ్గా ఉండి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా శరీరానికి అందాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనికి కేవలం ఆహారం మాత్రమే కాకుండా కొన్ని రకాల జ్యూస్ లు తీసుకోవాల్సి ఉంటుంది.
పండ్లతో తయారు చేసిన రసాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా పలు పండ్ల రసాలను తీసుకుంటే అభిజ్ఞా ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ పండ్ల రసాలు ఏంటో తెలుసుకుందాం.
దానిమ్మ రసం
రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచేందుకు దానిమ్మ రసం తోడ్పడుతుంది. అంతేకాదు మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది.
నారింజ రసం
నారింజ రసం తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నారింజ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ వంటి వాటిని పెంచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు మెదడుపై ఉండే ఒత్తిడిని కూడా తగ్గించేందుకు సహకరిస్తుంది.
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెంచి, మెదడులోని కణాలకు పోషకాలు, ఆక్సిజన్ ను అందిస్తుంది.
ద్రాక్ష రసం
ద్రాక్ష రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)