
Tuberculosis- TB : నయం చేయగలిగిందీ, నివారించగలిగిందీ క్షయ(Tuberculosis-TB) వ్యాధి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న రెండో రెండో అతి పెద్ద అంటు వ్యాధి ఇదే. 2022లో 1.13 మిలియన్ల మంది టీబీకి బలయ్యారు. వీరిలో 1.67 లక్షల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులూ ఉన్నారు.
నిరుడు కొవిడ్ వల్ల 1.24 మిలియన్ల మంది మరణించారు. ఎయిడ్స్/హెచ్ఐవీ వల్ల 0.63 మిలియన్లు, మలేరియా వల్ల 0.62 మిలియన్ల మంది మృతి చెందారు. టీబీతో మరణించిన హెచ్ఐవీ బాధితులను ఎయిడ్స్/హెచ్ఐవీ మృతుల కేటగిరీలో చేర్చారు. ఎయిడ్స్ బాధితులను ఎక్కువగా మృత్యుముఖానికి చేర్చుతున్నది టీబీయే.
మృత్యువు సమీపించడానికి గల అన్ని కారణాలను పరిగణించిన డబ్ల్యూహెచ్‌వో 2019లో అంచనాలను రూపొందించింది.
హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్.. ఈ మూడే బిగ్గెస్ట్ కిల్లర్లు అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. టీబీ 13వ ర్యాంక్‌లో నిలిచింది.