EPAPER

Pomegranate Peel Benefits: దానిమ్మ తొక్కతో ఫేస్ ప్యాక్ ఎప్పుడైన ట్రై చేశారా..? మీ ముఖం మెరిసిపోవాలంటే తప్పక వాడండి..

Pomegranate Peel Benefits: దానిమ్మ తొక్కతో ఫేస్ ప్యాక్ ఎప్పుడైన ట్రై చేశారా..? మీ ముఖం మెరిసిపోవాలంటే తప్పక వాడండి..

Use Pomegranate Face Masks for Glowing Skin: దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికి తెలుసు. కానీ దానిమ్మ తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎవరికైన తెలుసా? పోనీ ఎప్పుడైన విన్నారా? అవును దానిమ్మ తొక్కలో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక ఇన్ని రోజులు దానిమ్మ పండును తిని తొక్కను పారేస్తూ ఉంటాం.. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి.


ఇవి రక్త పోటు నియంత్రించడంలో సహాయపడతాయి. అన్ని రకాల విటమిన్ కలిగిన పండ్లలో దానిమ్మ ఒకటి. దానిమ్మ తొక్కతో ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. దానిమ్మ తొక్కలను నానబెట్టి ఆ నీటిని కషాయంలాగా త్రాగవచ్చు. వీటివల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా శరీరంలోని విషపదార్ధాలు కూడా తొలగిపోతాయి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లైతే దానిమ్మ తొక్క పొడిని కొద్దిగా వాటర్‌లో కలిపి నోటితో పుక్కిలిస్తే ఈ సమస్యను దూరం చేస్తుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన దానిమ్మ తొక్కతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం. దానిమ్మ తొక్కతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు  చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం:


ముందుగా దానిమ్మ తొక్కలను రెండు వారాలపాటు ఎండ బెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే బయట మార్కెట్లో నాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వాటితో ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు.

దానిమ్మ ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి.

రెండు స్పూన్ ల దానిమ్మతొక్క పొడి తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. రాత్రి పడుకునే ముందు తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.

రెండు చెంచాల దానిమ్మ తొక్క పొడిలో ఒక టేబుల్ స్పూన్ పాలు, తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి.  15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుంది.

దానిమ్మ తొక్క పొడిలో.. కొబ్బరి నూనే వేసి తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది కూడా.

రెండు టేబుల్ స్పూన్ దానిమ్మ తొక్క పొడిలో తేనె, రోజ్ వాటర్, చిటెకెడు పసుపు వేసి వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి.  10 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చర్మంపై జిడ్డు, మురికిని తొలగిస్తాయి, మీ ముఖం మిల మిల మెరిసిపోతుంది.

Related News

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×