
Veg Juices : చాలా మంది ఉదయం తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, వీటికంటే పండ్లు, కూరగాయల రసాలు తాగటం మంచిదట. టిఫిన్ చేశాక ఈ జ్యూసులు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఆ జ్యూసులేవో చూద్దామా!
పాలకూర జ్యూస్
ఆకుపచ్చని ఆకుకూరల్లో ఒకటైన పాలకూరలో పోషకాలు పుష్కలం. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో శరీరానికి సహజంగా పోషక శక్తిని అందిస్తుంది. పాలకూరను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. చాలామంది పాలకూరను వండుకొని తినడానికే ఇష్టపడతారు.
సొరకాయ జ్యూస్
సొరకాయలో విటమిన్ సి, బి, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. దీనిలోని పీచు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.