
Wedding Cakes: కేకులు.. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో అమితంగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా బర్త్ డే పార్టీస్, పెళ్లి వేడుకల్లో ఆర్డర్ చేయించి ప్రత్యేక రోజున కేకులు తింటూ ఎంజాయ్ చేస్తుంటాం. అయితే, పెళ్లికూతరు కేకు గురించి చాలా మందికి తెలియదు. వీటి గురించి క్లుప్తంగా మీ కోసం.
జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది పెళ్లంటే.. తప్పెట్లు, తాళాలు మాత్రమే కాదు. నోరూరించే కేకులు కూడా. పెళ్లికూతురు అయ్యాక.. ప్రతి క్షణాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకొనే వారు ఇప్పుడు కేకులతోనూ తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇదిగో అలా తయారైనవే ఈ పెళ్లికూతురు కేకులు. వీటిని ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి తెచ్చారు బేకరీ నిర్వాహకులు. ఇలాంటివి కావాలంటే మూడు రోజుల ముందే ఆర్డర్ ఇవ్వాలట.