
white Poha Benefits : ఒడ్లు దంచగా వచ్చే అటుకులు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పర్లేదు. వీటితో చేసే అటుకుల ఉప్మా, అటుకుల పాయసం, మిరియాల అటుకులు, కొత్తి మీర అటుకులు, అటుకుల పులిహోర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి.ఇక అటుకులతో ఏ వంట చేసుకున్నా.. అద్బుతంగా ఉంటాయి. అటుకులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
రక్తహీనత సమస్య ఉన్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్ అనీ, అటుకుల్లో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అటుకుల్లో విటమిన్ ఏ,బి,సి,కెతో బాటు కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నీరసంగా ఉన్నవారు అటుకులను పాలలో నానబెట్టి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.అటుకుల్లో గ్లూకోజ్ గాని కొవ్వు గానీ ఉండవు గనుక బరువు తగ్గాలనుకునే వారూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.అటుకుల్లోని ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది.అలాగే అటుకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో భయంకర వైరస్‌లకు చెక్ పెట్టి శరీరాన్ని కాపాడతాయి.