
Winter Dresses : శీతాకాలం షురూ.. ఇక అందరూ వెచ్చదాన్నిచ్చే దుస్తులపై శ్రద్ధ పెడుతుంటారు. కానీ ప్రస్తుత తరం ఫ్యాషన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా చలి దుస్తులు రూపాన్ని మార్చుకుంటున్నాయి. ష్రగ్స్, హుడీస్, కేప్స్.. ఇలా సరికొత్త శీతాకాల దుస్తుల్లో యువరతం స్టైలిష్‌గా మెరిసిపోతుంది. వాటిపై ఓ లుక్కేద్దాం.
టర్టిల్ నెక్ స్వెటర్
సాధారణ స్వెటర్‌కి హై కాలర్ ఉంటుంది. దీనివల్ల టర్టిల్ నెక్ స్వెటర్ మెడను పూర్తిగా కప్పేస్తుంది. ఇది హైనెక్‌తో పాటు ఫుల్ స్లీవ్స్‌తో ఉంటుంది. ముఖ్యంగా యువతకు మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. ఈ స్వెటర్‌ను జీన్స్, ష్కర్ట్స్, లెగ్గిన్స్‌కు జత చేయవచ్చు.
వర్సిటీ జాకెట్
ప్రస్తుతం యువతీ యువకులు వర్సిటీ జాకెట్స్ ధరించేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీన్ని జీన్స్, మినీ స్కర్ట్స్‌కు జతగా టీషర్ట్స్‌పై ధరించవచ్చు. ఈ సీజన్‌లో విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి వర్సిటీ జాకెట్స్ బెస్ట్ ఆప్షన్.
హుడీస్
ప్రస్తుతం హుడీస్ గిరాకీ బాగా పెరిగింది. కారణం.. ఇందులో ఉండే మెత్తటి ఫ్యాబ్రిక్. దీనిలో ఫుల్ స్లీవ్స్‌తో పాటు మొత్తం తలను, మెడను కప్పేలా హుడీ ఉండటం వల్ల చలి నుంచి రక్షణ పొందవచ్చు. జిప్, పుల్ ఓవర్ మోడల్ హుడీస్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
కేప్స్
బూట్‌కట్ జీన్స్, పలాజో ప్యాంట్స్‌పైకి కేప్స్‌ను జత చేస్తే అదిరిపోతుంది. ముఖ్యంగా ట్యాంక్ టాప్స్ పైకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. వయసుపైబడిన వారు కూడా ఈ స్వెటర్స్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు. వీటిని ఔటింగ్‌కు ధరిస్తే ట్రెండీగా కనిపిస్తారు.