Remedies For Teeth Whitening: మన శరీరంలో అన్ని భాగాలు పని చేయాలంటే ఆహారం చాలా అవసరం. ఆ ఆహారం తినడానికి నోటిలో ఉండే దంతాలే సహకరిస్తాయి. దంతాల మూలంగా ఆహారాన్ని నమిలి తినడం సాధ్యమవుతుంది. అందువల్ల తరచూ ఉదయం ఆహారం వల్ల దంతాలు పాడవకుండా ఉండేందుకు ఉదయం, సాయంత్రం వేళ దంతాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కుపోయి ఉంటుంది. అందువల్ల దానిని నీటిగా శుభ్రంగా చేసుకోవాలి. లేకపోతే పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోయి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముక్యంగా దంతాలు పసుపు రంగులోకి మారడం, పిప్పళ్లు, పంటి సమస్యలు వంటి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో దంతాలను మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
ఉప్పు
వంటల్లో వాడే ఉప్పుతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. దంతాల మధ్య పేరుకుపోయిన పసుపు మరకలను ఉప్పు సులభంగా తొలగిస్తుంది. అంతేకాదు బ్రష్ కంటే చేతి వేలితో దంతాలను ఉప్పు పెట్టి శుభ్రం చేసుకోవడం వల్ల ఈజీగా పసుపు రంగు తొలగిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఉప్పు కారణంగా దంతాలు బలంగా, పటిొష్టంగా తయారవుతాయి. అయితే బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిళ్ దెబ్బతింటుంది. దీని కారణంగా చిగుళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కూడా దంతాలను రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెను పుల్లింగ్ చేయడం ద్వారా దంతాలపై పేరుకుపోయిన పసుపు రంగును తొలగించుకోవచ్చు. అందువల్ల కొబ్బరినూనెను 10 నుంచి 20 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
ఇది చిగుళ్ల పరిశుభ్రతకు తోడ్పడుతుంది. అంతేకాదు దంతాపై పేరుకుపోయిన పసుపు రంగును తొలగించి మెరిసేలా చేస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)