PinTS

Telangana : తెలంగాణలో భానుడి విశ్వరూపం.. వడగాల్పులతో జనం ఉక్కిరి బిక్కిరి..

Telangana : తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రత అమాంతం పెరిగింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల సెంట్రీగేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలా చోట్ల ఉష్టోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగతలు దాటే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. కరీంనగర్‌, జనగామ, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల , కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

కొన్ని రోజుల క్రితం వరకు పగటివేళ ఎండలు దంచికొట్టినా.. రాత్రి వేళ మాత్రం చలిగాలులు వీచేవి. కానీ ప్రస్తుతం పగటి పూట ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే రాత్రి వేళ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related posts

Singareni: సింగరేణి గనుల అమ్మకం నిజమే!.. మరి, మోదీ అబద్దం చెప్పారా?

BigTv Desk

Samantha : విడాకులపై సమంత హాట్ కామెంట్స్.. అందుకే పుష్పలో ఐటమ్ సాంగ్ చేశా..

Bigtv Digital

Srinidhi College vs Parents: ప్రశ్నించిన పేరెంట్స్‌పై దాడి.. శ్రీనిధి కాలేజ్ ఓవరాక్షన్..

Bigtv Digital

Leave a Comment