
Flexfuel Car : ప్రపంచంలోనే తొలి బీఎస్-6 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత కారును భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపితే ఫ్లెక్స్ ఫ్యూయల్ అవుతుంది. ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను టయోటా కిర్లోస్కర్ అభివృద్ధి చేసింది. భారత్‌లోని అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు తగినవిధంగా ఈ వాహనాన్ని రూపొందించారు. 20 శాతానికి మించి కలిపిన ఇథనాల్‌తోనూ ఈ కారు నడుస్తుంది. తాజాగా ఈ వెహికల్ ను
ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అభివృద్ధి చేసిన టయోటా కిర్లోస్కర్ యాజమాన్యాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. దేశంలో కాలుష్యం తగ్గడంతోపాటు వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఫ్లెక్స్ ఇంజిన్లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని సూచించారు. మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100 శాతం ఇథనాల్ వాహనాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే.. జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి పెరుగుతుందని గడ్కరీ వివరించారు. ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందన్నారు. దీంతో రైతులు కేవలం అన్నదాతలే కాదు ఇంధనదాతలు అవుతారని అన్నారు.