
Vikram lander chandrayaan 3 news(Today latest news telugu):
చంద్రయాన్-3 పై మరో లేటెస్ట్ అప్ డేట్ ను ఇస్రో అందించింది. విక్రమ్ ల్యాండర్ నిర్దేశించిన టార్గెట్ ను మించి పనితీరును ప్రదర్శించిందని ట్వీట్ చేసింది. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
ఇస్రో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ మరోసారి సక్సెస్ ఫుల్ గా పనిని పూర్తి చేసింది. దానికి ఇచ్చిన సంకేతాలతో ల్యాండర్ ఇంజిన్లను మండించుకుంది. 40 సెంటీమీటర్ల గాల్లోకి లేచింది. 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో వివరించింది.
విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని వెల్లడించింది ఇస్రో. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆగస్టు 23న
ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండైన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా పేరుపెట్టారు. ఇప్పుడు రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.