
Chandrayaan-3 Mission : చంద్రయాన్ -3 మిషన్ కు సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ వీడియోను విక్రమ్ ల్యాండర్ తీసింది. తాజాగా ఈ దృశ్యాలను ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది. సరైనమార్గం కోసం రోవర్ తిరుగుతూ చర్చ్ చేస్తుండగా ల్యాండర్ ఈ వీడియోను తీసింది. తల్లి (ల్యాండర్) గమనిస్తుంటే చందమామ పెరట్లో చిన్నారి (రోవర్) సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉందంటూ ఇస్రో పేర్కొంది.
ఆగస్టు 30న ల్యాండర్ విక్రమ్ ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది. ఈ ఫోటో ఆసక్తిరేపింది. మరోవైపు చంద్రునిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఇస్రో వెల్లడిస్తోంది. ఇప్పటికే ల్యాండర్, రోవర్ చంద్రుడిపై దిగి 9 రోజులు అయ్యింది. మరో 5 రోజులు చంద్రుడిపై పరిశోధనలు సాగనున్నాయి. అక్కడ ఉన్న ఖనిజాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. రోవర్ ఈ పనిని చేస్తోంది.
సెప్టెంబర్ 5 తర్వాత చంద్రుడిపై చీకటి పడుతుంది. దీంతో ఉష్ట్రోగతలు బాగా పడిపోతాయి. ఆ తర్వాత 14 రోజులకు మళ్లీ వెలుతురు వస్తుంది. అప్పటికి ల్యాండర్ , రోవర్ మళ్లీ పనిచేస్తే మరో 14 రోజులు పరిశోధనలు కొనసాగుతాయి. అవి పనిచేయకపోతే చంద్రయాన్-3 మిషన్ ముగుస్తుంది.