BigTV English
Advertisement

Lava Probuds N33: రూ.1,299 ధరకే 40 గంటల బ్యాటరీ లైఫ్.. నెక్‌బ్యాండ్ ఫీచర్స్ అదిరింది!

Lava Probuds N33: రూ.1,299 ధరకే 40 గంటల బ్యాటరీ లైఫ్.. నెక్‌బ్యాండ్ ఫీచర్స్ అదిరింది!

Lava Probuds N33: ప్రముఖ లావా కంపెనీ భారత్ మార్కెట్‌లో ఇటీవలే లావా షార్క్-2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా Lava Probuds N33 నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది. ఇది మెరుగైన పనితీరుతో, సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ Lava Probuds N33 నెక్‌బ్యాండ్ ANC ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. అందరూ కొనగలిగేలా తక్కువ ధరలోనే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, ధర వివరాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం..


ఆకట్టుకునేలా డిజైన్:

Lava Probuds N33 నెక్‌బ్యాండ్ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే మెటాలిక్ ఫినిషింగ్, ఫ్లెక్సిబుల్ బిల్డ్, బిల్డ్, 13mm డైనమిక్ బాస్ డ్రైవర్‌ను కలిగి ఉంది. లావా సంస్థ ఈ నెక్‌బ్యాండ్‌ని సాంగ్స్, కాలింగ్, గేమింగ్ అవసరాల కోసం రూపొందించిందినట్లు తెలుస్తోంది. ఈ నెక్‌బ్యాండ్ డిజైన్ పరంగానూ ఆకట్టుకునే రూపంలో ఉంది.

అందుబాటులో ధరలోనే:

Lava Probuds N33ని లావా కంపెనీ రూ.1,299 ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నెక్‌బ్యాండ్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. కంపెనీ అధికారిక ఇ-స్టోర్, భాగస్వామి రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రతిఒక్కరికీ అందుబాటులో ధరలోనే ఉండటం వల్ల చాలామంది ఇప్పటికే ఆర్డర్ చేసుకోవడం కూడా విశేషం.


అదిరిపోయే ఫీచర్స్:

Lava Probuds N33 ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రోబడ్స్ N33 నెక్‌బ్యాండ్ ANC 30dB వరకు నాయిస్ తగ్గింపును అందిస్తుంది. ఇది ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ ఫీచర్స్ వల్ల కాల్స్ సమయంలో వాయిస్ స్పష్టతను మెరుగుపరుస్తుంది. ఇక ఆన్‌లైన్ గేమింగ్ కోసమైతే.. ఈ నెక్‌బ్యాండ్ ప్రో గేమ్ మోడ్ 45ms తక్కువ జాప్యానికి మద్దతు ఇస్తుంది. గేమ్‌ప్లే లేదా వీడియో స్ట్రీమింగ్ సమయంలో సౌండ్ సింక్రొనైజేషన్‌ను కూడా మెరుగుపరుస్తుంది.

బ్యాటరీ పరంగా చూస్తే..

ఈ నెక్‌బ్యాండ్ 300mAh బ్యాటరీతో వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా 40 గంటల ప్లేబ్యాక్‌ను, ANCతో 31 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ పెడితే చాలు, 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ కోసం దీనికి టైప్-సి పోర్ట్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం, దీనికి బ్లూటూత్ v5.4 ఉంది. నెక్‌బ్యాండ్ డ్యూయల్ డివైస్ పెయిరింగ్‌కు కూడా మద్దతు లభిస్తోంది. ఇది ఆటోమేటిక్ పవర్ కంట్రోల్ కోసం.. మాగ్నెటిక్ హాల్ స్విచ్‌ను కలిగి ఉంది. ఈ నెక్‌బ్యాండ్ పాటలు, కాల్స్‌ను నిర్వహించడానికి ఇన్-లైన్ బటన్‌లను సైతం కలిగి ఉంది. లావా ప్రోబడ్స్ N33 నెక్‌బ్యాండ్ IPX5 రేటింగ్‌తో వస్తుంది.

Related News

Agentic AI: ఏఐలకే బాబు ఏజెంటిక్‌ ఏఐ.. మానవ ప్రమేయం అక్కర్లేదట!

Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI

ISRO LVM3-M5: నింగిలోకి దూసుకెళ్లిన LVM3 M5.. ‘సీఎంఎస్‌-03’ ప్రయోగం విజయవంతం..

Air Purifiers: ఇంట్లో కాలుష్యానికి కళ్లెం.. రూ.5వేల లోపే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

Google Pixel 10 Pro: పిక్సెల్ 10 ప్రో బుక్ చేస్తే రూ10వేలు తగ్గింపు.. గూగుల్ బంపర్ ఆఫర్

Redmi Note 12 Pro: రెడ్‌మి నోట్ 12 ప్రో లాంచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ధర ఎంతంటే?

iPhone 20 Flip 6G Offers: ఐఫోన్ 20 ఫ్లిప్ 6జి బుక్ చేసేవారికి గిఫ్ట్.. రూ.15వేలు విలువైన ఎయిర్‌పాడ్స్ అల్ట్రా ఫ్రీ

Big Stories

×