
Time Management: అనుకున్న పని.. అనుకున్న టైంకి జరగాలంటే సరైన టైమ్ మేనేజ్ మెంట్ ఉండాలి. మనకున్న సమయాన్ని వృధాకాకుండా, దానిని గరిష్టంగా మన అవసరాలకు సద్వినియోగం చేసుకోవటమే టైమ్ మేనేజ్‌మెంట్.
టైమ్ మేనేజ్‌మెంట్‌ను అమలుచేయగలిగిన వ్యక్తులు.. జీవితంలో మంచి విజయాలను అందుకోగలరని చరిత్ర చెబుతోంది.
ఇల్లు, ఆఫీసు ఇలా.. ప్రతిచోటా టైమ్ మేనేజ్‌మెంట్ అవసరమే. అలాగే.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సులభంగా దీన్ని పాటించొచ్చు.
రోజులో ఏ పనికి, ఎంత టైమ్ కేటాయించాలో ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే.. రోజువారీ పనులు అవాంతరాలు లేకుండా సాగిపోతాయి.
టైమ్ మేనేజ్‌మెంట్ చేయాలనుకునే వారు.. ఒకరోజు లేదా వారంలో పూర్తి చేయాల్సిన పనులను.. ఒక జాబితా రూపంలో రాసుకోవాలి.

వాటిలో ప్రాధాన్యతను బట్టి ముందు ఏది ముందు? ఏది తర్వాత? ఏది ఆలస్యమైనా పర్వాలేదో నిర్ణయించుకుని.. వాటికి తగిన టైమ్ కేటాయించుకోవాలి.
అలాగే.. ఏ పనికి ఎంత టైమ్ అనేదీ అంచానా వేసుకొని రాసుకొని, ఆ ప్రకారం టైమ్ మేనేజ్ చేసుకోవాలి. లేకుంటే.. మొత్తం ప్లాన్ వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇక.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. మీకంటూ కొంత వ్యక్తిగత సమయం కేటాయించుకోవటమూ టైమ్ మేనేజ్‌మెంట్‌లో భాగమే.
చేయాల్సిన పనుల లిస్టును వెంట ఉంచుకుంటూ అవసరమైతే మార్పులు చేసుకోవటం, వీలుంటే.. యాప్‌లో షెడ్యూల్ చేసుకుంటే మరీ మంచిది.
షెడ్యూల్ తయారుచేసుకోవటం, దానిని అమలుచేయటం, టైమ్‌ను వేస్ట్ కాకుండా చూసుకోవగలిగితే.. మీరు టైమ్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్ అయినట్లే.