
Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం పూర్తి అయింది. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ ప్రక్రియ పూర్తయ్యింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న నామినేషన్లను.. అలాగే ప్రత్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థలను ఈసీ అధికారులు రాత్రి వరకు పరిశీలించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు వచ్చాయి. అందులో 608 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
రాష్ట్రంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన నేతల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
కొంతమంది అభ్యర్థులు మూడు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఈసీ నిబంధనలు ప్రకారం 2 కంటే ఎక్కువ స్థానాల్లో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడానికి అవకాశం లేదు. కానీ.. ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్థులు 2 కంటే ఎక్కువ నియోజవర్గాల్లో నామినేషన్ వేశారు. అలాంటి వారి నామినేషన్లను పరిశీలించిన అధికారులు.. మొదట్లో వచ్చిన 2 స్థానాల్లోని నామినేషన్లను మాత్రమే ఆమోదించారు.
నామినేషన్లతో పాటు పలువురి నుంచి వచ్చిన కొన్ని అభ్యర్థనలను కూడా ఈసీ తిరస్కరించింది. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, అజయ్‌కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేవని.. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. అయితే, కాంగ్రెస్ అభ్యంతరాలను ఈసీ తిరస్కరించింది. దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉందని బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. అయితే, నామినేషన్ వేసినపుడే.. మధుసూదన్ రెడ్డి తన రెండో ఓటును రద్దు చేయాలని ఈసీకి ధరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యంతరాన్ని ఈసీ పక్కన పెట్టింది.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయని బీఆర్ఎస్ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. అయితే, అది ఈసీ నిబంధనలకు వ్యతిరేకంకాదని.. అధికారులు తేల్చి చెప్పారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారన్న అభ్యంతరాలనూ అధికారులు తోసిపుచ్చారు.
RevanthReddy : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రేవంత్ రెడ్డి విశ్వాసం..