
Election Commission Of India : దేశవ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్ చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
5 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్ చేసినట్లు ఈసీ ప్రకటించింది. గత ఎన్నికలతో పోల్చితే 7 రెట్లు ఎక్కువ నగదు సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న 5 రాష్ట్రాల్లో.. తెలంగాణలోనే ఎక్కువ సీజ్ చేశామని ఈసీ ప్రకటించింది.
ఇప్పటి వరకు తెలంగాణలో సీజ్ చేసిన సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. నగదు రూ.225.23 కోట్లు సీజ్ చేశామని తెలిపింది. రూ.86.82 కోట్ల విలువైన మద్యం పట్టుబడిందని పేర్కొంది. రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని ప్రకటించింది. రూ.191.02 కోట్ల విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులు పట్టుబడ్డాయని వివరించింది. మొత్తంగా తెలంగాణలో సీజ్ చేసిన సొత్తు విలువను రూ.659.2 కోట్లు ఉంటుందని ఈసీ స్పష్టం చేశారు.