
Telangana Elections : తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌కు గండికొట్టేలా బీజేపీ స్కెచ్ వేసిందా? బీఆర్‌ఎస్‌కు మేలు జరిగినా ఫరవాలేదు.. కాంగ్రెస్ లాభపడొద్దనేలా బీజేపీ వ్యూహం రచించిందా? ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు. తెలంగాణలో పవన్‌తో బీజేపీ పొత్తు అందులో భాగమేననే చర్చ జరుగుతోంది.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ, బీజేపీలపై కమ్మ సామాజికవర్గం కోపంగా ఉందని, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో ఆందోళనలు కూడా చేయనివ్వకపోవడంపైనా తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని అంటున్నారు. బీఆర్‌ఎస్ నేతలు డ్యామేజ్ కంట్రోల్‌కు దిగినా… కమ్మ సామాజికవర్గంలో కోపం తగ్గలేదనే చర్చ జరుగుతోంది. జగన్‌కు అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించడంపైనా కమ్మ సామాజిక వర్గం గుర్రుగా ఉందని విశ్లేషకుల అంచనా.
రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. దాంతో…
రేవంత్ అనుకూల ఓటు బ్యాంక్‌కు గండికొట్టేలా బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణలో పవన్‌తో కలిసి పోటీ చేస్తే చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లు కూటమికే పడతాయనే ఆలోచనతోనే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్ లాంటి స్థానాలను జనసేనకు కేటాయిస్తే.. చంద్రబాబు సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్‌కు దూరమవుతాయని బీజేపీ అంచనా వేస్తోందని అంటున్నారు. ఒకవేళ తాము గెలవకపోయినా కాంగ్రెస్ ఓడిపోతే చాలన్నట్లు కమలనాథుల రాజకీయం ఉందనే చర్చ జరుగుతోంది.
Mallareddy IT Raids Updates : ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం : మంత్రి మల్లారెడ్డి