
Telangana Elections : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. సొంత జిల్లా.. సొంత నియోజకవర్గంలో కేసీఆర్‌కు మరోసారి వ్యతిరేకత ఎదురైంది. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఆయన బాధితులు ఎన్నికల కదన రంగంలోకి దిగారు. మొత్తంగా 43 మంది కేసీఆర్‌పై పోటీకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు 70 మంది విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి భూనిర్వాసితులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, చెరుకు రైతులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయగా వారితో విత్డ్రా చేయించడంతో బీఆర్ఎస్ లీడర్లు కాస్త విజయం సాధించారు. కానీ అప్పటికి కూడా గజ్వేల్‌లో 44 మంది బరిలోకి నిలవడం హైలేట్ అనే చెప్పాలి.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఎస్పీ నుంచి జక్కని సంజయ్ కుమార్, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలోని వట్టి నాగులపల్లి గ్రామంలో శంకర్ హిల్స్ అసోసియేషన్ మెంబర్స్ 45 మంది, అమరవీరుల కుటుంబ సభ్యులు 30 మందితో కలుపుకొని అత్యధికంగా 127 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 70 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో 44 మంది బరిలో ఉన్నారు.
ఇక కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌పై కూడా 38 మంది పోటీ చేయనున్నారు. మొత్తంగా కామారెడ్డిలో 39 మంది , గజ్వేల్ లో 44 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.