
Satyavathi Rathod : తెలంగాణలో ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు ప్రలోభాల పర్వం మొదలైంది. ఈ క్రమంలోనే అడ్డంగా బుక్కయ్యారు మంత్రి సత్యవతి రాథోడ్. ఓటర్లను ఆమె ప్రలోభ పెడుతున్నారంటూ గుడూరు పీఎస్‌లో కేసు నమోదైంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొంగర గిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున మంత్రి సత్యవతి ప్రచారం చేశారు. కొంగర గిద్దెలో మంత్రికి స్థానిక మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. దీంతో పళ్లెంలో రూ. 4 వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.
మంత్రి మంగళ హారతి పల్లెంలో ఎవరికి… ఎన్ని డబ్బులు వేశారానే విషయాన్ని FST బృందం సభ్యుడు మురళీ మోహన్ విచారణ చేసి నిర్ధారించుకున్నారు. అనంతరం ఓటర్లను ప్రోలోభ పెట్టేందుకు మంగళహారతి పళ్లెంలో డబ్బులు వేశారని… గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మంత్రి సత్యవతి రాథోడ్ పై పలు సెక్షన్‌లతో గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-ఈ, 171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్యూ 188 ఐవోసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.