
Congress : తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయా? బీఆర్ఎస్ ఊహించని విధంగా కాంగ్రెస్ దెబ్బ కొట్టబోతోందా? ఢిల్లీ వేదికగా సంచనల విషయాలు బయటకు రానున్నాయి. ఇతర పార్టీల్లోని ప్రముఖ నాయకులు కొందరు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఆ లీడర్లు ఎవరు? ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే విషయాలను సస్పెన్స్‌లో పెట్టింది హైకమాండ్. పార్టీలోని కొందరు ముఖ్య నాయకులకు మాత్రమే వాళ్ల పేర్లు తెలుసని చెప్తున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు కేసీఆర్‌ను పొలిటికల్‌గా రౌండప్ చేసేలా కాంగ్రెస్ వ్యూహరచన చేసింది.
కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆ ప్రముఖ నాయకులు ఎవరు? ఏ పార్టీ నుంచి చేరబోతున్నారు? వాళ్లది ఏ జిల్లా? ఏ నియోజకవర్గాలకు చెందినవారు? ఇవన్నీ త్వరలోనే రివీల్ కాబోతున్నాయి. చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.
కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. అధిష్టానం ఆమోదమే మిగిలింది. అదే విధంగా బీఆర్ఎస్‌లో నెంబర్ టూ పొజిషన్‌లో ఉన్న కేటీఆర్, హరీష్‌రావును సైతం చక్రబంధంలో ఇరికించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టు చెప్తున్నారు. మంత్రి హరీష్‌రావు మీద కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు మీదే కాదు.. మరికొన్ని ప్రముఖ నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్థులను కాంగ్రెస్ పోటీ చేయించబోతోంది. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పారిజాతం బరిలో దిగనున్నారు. తాండూరులో కాంగ్రెస్ నుంచి వచ్చిన పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా.. ఆయనపై మనోహర్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. అటు ముధోల్ నుంచి నారాయణరావు పటేల్, నర్సాపూర్‌లో రాజిరెడ్డి బరిలో నిలుస్తారని చెప్తున్నారు. పాలకుర్తిలో ఝాన్సీ యశస్విని రెడ్డి ఖాయమని చెప్తున్నారు.
Bandi Sanjay : బండి అరెస్టుపై రాజకీయ రగడ.. బీజేపీ హైకమాండ్ ఆరా.. బీఆర్ఎస్ ఎదురుదాడి..