
Congress Manifesto : తెలంగాణలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ విభిన్న వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కారు హ్యాట్రిక్ కు బ్రేకులు వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అసరమేంటో స్పష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మైనార్టీ, ఎస్టీ,ఎస్టీ, బీసీ డిక్లరేషన్లు చేసింది. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలివే..!
గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం
రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతోపాటు కమీషన్
అభయ హస్తం పథకం పునరుద్ధరణ
ఆర్ఎంపీ, పీఏంపీలకు గుర్తింపు కార్డు
అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ
ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్
ధరణి స్థానంలో భూభారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్
జర్నలిస్టులకు మెట్రో ఫ్రీ
మీడియా కమీషన్ ఏర్పాటు
కల్యాణ లక్ష్మి కింద లక్ష సాయం, తులం బంగారం
రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ
విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం
ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు
.
.
.