
Congress Rebels : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. దీంతో కాంగ్రెస్ తన రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడింది. పది నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రెబల్స్‌తో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే చర్చిస్తున్నారు. బరిలో నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు.
10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను రెబెల్ గా పోటీకి దిగారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. దీంతో రెబల్స్ ను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు నేతలు చర్చలు జరుపుతున్నారు. స్వయంగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు.
కాంగ్రెస్స్ రెబల్ గా నామినేషన్ వేసిన నియోజకవర్గాలు..
సూర్యాపేట – పటేల్ రమేశ్ రెడ్డి
ఆదిలాబాద్ – సంజీవ్ రెడ్డి
బోథ్ – వెన్నెల అశోక్ ,నరేష్ జాదవ్
వరంగల్ వెస్ట్ – జంగా రాఘవరెడ్డి
వైరా – విజయ భాయ్
నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
ఇబ్రహీంపట్నం – దండెం రాంరెడ్డి
డోర్నకల్ – నెహ్రూ నాయక్
జుక్కల్ – సౌదాగర్ గంగారం
బాన్సువాడ – కాసుల బాలరాజు
సిరిసిల్ల – ఉమేష్ రావు
.
.
.