
Gadwal Politics : తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే అనడం కామన్. అంటే జూదం ఆటలో తమ్ముడైనా డబ్బులివ్వాల్సిందే. అది మహాభారత యుద్ధంలోనూ తేలిపోయింది. పాండవులు, కౌరవులు జూదం ఆడటం వల్ల మహా యుద్ధానికి దారితీసింది. ఇదే ప్రిన్సిపుల్ రాజకీయాల్లోనూ ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్లు తెరవెనుక రాజకీయాలు నెరపటం కొత్తేమీ కాదు.
ఒక పార్టీలో ఉండి మరో పార్టీలో ఉన్న తమవారిని గెలిపించేందుకు సీక్రెట్ పాలిటిక్స్ నడుపుతారు. ఇప్పుడు గద్వాలలోనూ డీకే అరుణ ఇదే తరహాలో కేడీ పాలిటిక్స్‌కి పాల్పడుతున్నారనే చర్చ జరుగుతోంది. మేనల్లుడు రాజకీయ ప్రత్యర్థే అయినా లోపాయకారిగా జరుగుతున్న రాజకీయం బీసీ వర్గాలని ఆగ్రహానికి గురిచేస్తోంది. డీకే అరుణ తీరు గద్వాల బీజేపీ నేతలని కూడా ఆలోచలో పడేస్తోంది. కేసీఆర్ అంటే అంతెత్తున ఎగురిపడే డీకే అరుణ పోటీ చేయకపోవడానికి కారణం ఇదేనా అనే క్లారిటీ కూడా గద్వాల ప్రజలకు వచ్చేసింది.
గద్వాల రాజకీయాల్లో టక్కున గుర్తొచ్చేది డీకే కుటుంబం పేరే. బంగ్లా రాజకీయాలతో చక్రం తిప్పడం ఆనవాయితీగా వస్తోంది. 1957 నుంచి ఇప్పటి వరకు డీకే కుటంబం బరిలో దిగని ఎన్నికల్ని అక్కడి ఓటర్లు చూడలేదు. ఈసారి మాత్రం ఫస్ట్ టైం డీకే ఫ్యామిలీ పోటీకి దూరంగా ఉంది. ఫలితంగా ఈ ఎలక్షన్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరిదృష్టి గద్వాల కోటపైనే పడింది. బీసీ వాదం బలపడిందని.. వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే బరిలో దిగలేదని డీకే అరుణ ప్రకటించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఇది ఎంతవరకు నిజమనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. డీకే అరుణ పోటీకి దూరంగా ఉండటం వెనుక కారణాలు వేపే అనే చర్చ జరుగుతోంది. తాజాగా నియోజకవర్గంలో ఆమె తెర వెనుక నడుపుతున్న పాలిటిక్స్ తీవ్ర దురామారికి కారణమవుతున్నాయి. బీసీ వాదం గెలవకూడదనే అక్కసుతోనే డీకే అరుణ బరిలో దిగలేదని అసలు బండారం బయటపడేస్తోంది.
నడిగడ్డ రాజకీయాలు అంచనా వేయడం అంత ఈజీ కాదు. అక్కడ డేకీ ఫ్యామిలీదే ఆధిపత్యం. 1999లో మాత్రం అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. డీకే అరుణపై విజయం సాధించిన గట్టు భీముడు భారీ షాక్ ఇచ్చారు. బంగ్లా పాలనకు బ్రేక్ వేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహంతో బీసీ అస్త్రం ప్రయోగించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన హస్తం పార్టీ బీసీ మహిళని బరిలో దిపింది. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సరిత గులాబీ పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు.
గద్వాలలో బీసీ ఓటు బ్యాంకు అధికం. కురవ, వాల్మీకి బోయ సహా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గెలుపోటములను నిర్ణయిస్తారు. బీసీ వాదం బలపడటంతో డీకే అరుణ కుటుంబం వ్యూహాత్మకంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శివారెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా పోటీకి దింపింది. ఫలితంగా వాల్మీకీల ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ అలర్టయింది. అధికారంలో రాగానే వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు బీసీ మహిళ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేసిన పనులు కాంగ్రెస్ అభ్యర్థిని సరిత విజయానికి సానుకూల అంశాలుగా మారాయి. ఇదే డీకే అరుణకి కంటగింపుగా మారాయి. ఎలాగైనా మేనల్లుడి విజయానికి బాటలు వేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇదే సమయంలో బీసీ సామాజిక వర్గానికే చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆలిండియా ఫార్వార్డ బ్లాక్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ బీఎల్ఎఫ్ తరపున పోటీ చేశారు. అతని ప్రభావం సైతం బీసీ ఓటు బ్యాంకుపై పడనుంది. ఇటు బీసీ నినాదం అటు ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి.
దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత, నెట్టెంపాడు పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోవడం, గట్టు ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉండటం, గుర్రంగడ్డ వంతెన నిర్మాణం పనులు అటకెక్కాయి. చేనేత పార్కు ఏర్పాటు హామీ విస్మరణ, పర్యాటక కేంద్రంగా జూరాలను తీర్చిద్దుతామనే హామీలు నెరవేర్చలేదు. ఉన్నత విద్యాసంస్థల మంజూరు, మౌలిక వసతుల కల్పనలో విఫలం కావడం తదితర అంశాలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దారితీసేలా ఉన్నాయి. అయితే మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓడిపోకూడదనే ముందు నుంచి డీకే అరుణ వేసిన ఎత్తుగడలు ఒక్కొక్కటిగా అమలు చేయడం గద్వాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఆమె మేనల్లుడు, గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో ఆమెను బండ్ల ఓడించారు. ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగి గత పరభావానికి ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు. అయితే ఆమె పోటీ చేయకపోగా.. ఈసారి మేనల్లుడి విజయానికి ఇండైరెక్ట్‌గా పాటుపడుతున్నారు. ఏకంగా సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు భారీ కుట్రను అమలు చేస్తున్నారు. గద్వాల కోటలో వెనుక బడిన వర్గాల అభ్యర్థిని సరిత గెలవకుండా కుతంత్రాలకు పాల్పడుతున్నారు. తాను పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సరిత విజయం సాధిస్తారనే అంచనాతోనే డీకే అరుణ తప్పుకున్నట్లు లేటెస్ట్ పరిణామాలతో క్లారిటీ కనిపిస్తోంది. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
గద్వాలలో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వాళ్లందర్నీ మేనల్లుడి విజయం కోసం డీకే అరుణనే పంపిస్తున్నారని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మెల్ల మెల్లగా ఒక్కొక్కరిని పడవ దాటిస్తున్న తీరు అందరికి అర్థం అవుతోందని సోషల్ మీడియాలో డీకే అరుణకి గట్టిగా చురకలు వేస్తున్నారు. మొన్న కొందరు.. నేడు నీ నమ్మిన బంటు గడ్డం.. రేపు ఇంకెవరని ప్రశ్నిస్తున్నారు. చివరికి మీ అభ్యర్థిని కూడా మేనల్లుడి కోసం బీఆర్ఎస్‌లోకి పంపేలా ఉన్నారని ఫైరవుతున్నారు. తెరవెనుక మీరు చేస్తున్న కుటిల ప్రయత్నాలు అర్థం చేసుకోలేని దుస్థితిలో ఎవరూ లేరమ్మా..! పాపం అరుణమ్మా…! అంటూ సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరేస్తున్నారు.
అలాగే మరో విషయంపైనా డీకే అరుణని సోషల్ మీడియా వారియర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న దష్ప్రచారాన్ని ఎండగడుతున్నారు. మరి పాన్గల్‌లో జెడ్పిటీసీగా పోటీ చేసినప్పుడు నాన్‌లోకల్ మీకు గుర్తుకు రాలేదా అని ఫైరవుతున్నారు. ఏ అల్లుడి మీద అయితే ఈరోజు ప్రేమ చూపిస్తున్నావో.. అదే అల్లుడు ఓటమి ధ్యేయంగా ఐజా మండలం నుంచి తిరుమలరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించినప్పుడు లోకల్ కనిపించలేదా అని మండిపడుతున్నారు.
అంతెందుకు స్వయంగా మీరే గత పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడి ప్రజలు నిన్ను నాన్ లోకల్ అనే చీదరించుకున్నారా సమాధానం చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు. మరి మీ పార్టీ నాయకులు, ప్రధాన మంత్రిది ఏ రాష్ట్రం.. ఆయన ఏ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారని క్వశ్చన్స్ రెయిజ్ చేస్తున్నారు. గురిగింజ తన కింద నలుపు ఎరగదన్నట్టు దుష్ప్రచారం ఆపాలని.. నిన్ను నమ్ముకున్న బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలని డీకే అరుణ మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
బంగ్లా కులుస్తామని ఎవరు అనలేదని.. ఆ అవకాశం ఎవరికి ఇచ్చావని.. మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుని కూల్చుకుంటున్నారని.. డీకే అరుణకి చురకలు అంటిస్తున్నారు జనం. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదని సెటైర్లు వేస్తున్నారు. అల్లుడిని గెలిపించడానికి మీరు వేస్తున్న కుటిల ప్రయత్నాలు ఓటర్లకు నవ్వు తెప్పిస్తున్నాయని…కేంద్ర హోం మంత్రిని గద్వాలకి పిలిపించి బీఆర్ఎస్‌కి ప్రచారం చేసినట్లుంది మీ వ్యవహారమని మండిపడుతున్నారు. బై బై అరుణమ్మ…! జై సరితమ్మ.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నియోజకవర్గం ఓటర్లని ఆలోచనలో పడేస్తోంది. డీకీ అరుణ పోటీకి దూరంగా ఉండటం వెనక ఇంత రాజకీయ వ్యూహం ఉందా అని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనల్లుడి గెలుపుకోసం బీసీలని బలి పశువులను చేయాలని చూస్తున్న అరుణకి తగిన బుద్ధి చెబుతామని ఓటర్లు ప్రతినబూనుతున్నారు.
.
.