
EC : కరెన్సీ అంబులెన్స్‌ల పేరుతో బిగ్ టీవీ ఇచ్చిన కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ములుగు నుంచి కొడంగల్ వరకు దాదాపు 400 కిలోమీటర్లు రెండు అంబులెన్స్‌లు ఎందుకు వెళ్లాయి? వాటిలో ఏముంది? రోగులే ఉన్నారా? రోగులు ఉంటే.. వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రులను కాదని.. తాండూరు మీదుగా కొండగల్ రూట్‌లోకి ఎందుకెళ్లాయి? ములుగు నుంచి ఆ రెండు అంబులెన్స్‌లను ఎక్కడా ఆపకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిలో కోట్లు విలువైన నోట్ల కట్టాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంబులెన్స్ ల వ్యవహారంపై ఎన్నికల సంఘం స్పందించింది.
ఎమర్జెన్సీ టైమ్‌లో రోగుల్ని ఆస్పత్రికి చేర్చాల్సిన 108 అంబులెన్స్‌లను కరెన్సీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారా? అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇంతకీ, ఆ రెండు అంబులెన్స్‌ల్లో ఏముందో చెప్పాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం. దీంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. ఆ రెండు అంబులెన్స్‌లపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. అందరి దృష్టీ ప్రచారంపైనే ఉంది. మరోవైపు ప్రలోభాల పర్వానికి కూడా ఇప్పుడే తెర తీశారా? పుష్ప సినిమాలో అంబులెన్స్‌ల్లో ఎర్రచందనం దుంగలు తరలించినట్టు 108 వాహనాల్లో డబ్బు కట్టలను తరలిస్తున్నారా? రెండు 108 వెహికల్స్ ఒకదాని తర్వాత మరోటి ఎందుకు వెళ్లాయి? అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఎక్కడికి చేరాయి? ఏం తీసుకెళ్లాయి? ఎన్నికల సంఘం రిపోర్ట్ కోరడంతో వీటిపై ఫుల్ ఫోకస్ పెట్టింది అధికార యంత్రాంగం.
..
.
.