
Palakurthi : పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.ఇప్పటికే అనేక మంది స్థానిక బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడారు. ఆయన కుడిభుజం లాంటి నేతలు కారు దిగిపోతున్నారు. తాజాగా ఎర్రబెల్లి సమీప బంధువు ఎర్రబెల్లి రాఘవరావు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు.
ఎర్రబెల్లి రాఘవరావు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మంత్రి ఎర్రబెల్లికి మరో షాక్ తగిలినట్టైంది.
ఇప్పటికే పాలకుర్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి.ఈ చేరికలతో ఆమె బలం పెరిగిందంటున్నారు స్థానిక నేతలు.ఈసారి ఎన్నికల్లో ఎర్రబెల్లికి ఎదురుగాలి తప్పదని.. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.
ఓటమి భయంతోనే ఎర్రబెల్లి దయాకర్ లో ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రప్పించారు. పాలకుర్తిలో జరిగిన సభలో నియోజకవర్గానికి వరాలు ప్రకటించాలని వేడుకున్నారు. ఈ సభలో కేసీఆర్, ఎర్రబెల్లి ప్రసంగాల్లో ఓటమి భయం కనిపించింది.