
Gaddam Prasad Kumar News(Telangana politics):
వికారాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అక్కడ గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. తన గెలుపు అవకాశాలను బిగ్ టీవీ ఇంటర్వ్యూలో వివరించారు. అభివృద్ధిలో వికారాబాద్ చాలా వెనుకబడిందన్నారు. పదేళ్ల కిందట తాను చేసిన అభివృద్ధి తప్ప..
ఆ తర్వాత ఏ పనులు సరిగ్గా జరగలేదన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి అసలు జరగలేదని తెలిపారు.
చాలా గ్రామాల రోడ్లు గుంతలు పడి కనిపిస్తున్నాయని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి వర్గం అసంతృప్తితో ఉందని చెప్పారు. ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారని స్పష్టం చేశారు. గులాబీ కండువాలు వేసుకున్న వారికే.. సంక్షేమ పథకాలు దక్కాయని ఆరోపించారు. దళితబంధు పథకం కమిషన్ల బంధు అయిందని విమర్శించారు.
వికారాబాద్ నియోజకవర్గంలో.. సాగు, తాగు నీటికి తీవ్ర కొరత ఉందని గడ్డం ప్రసాద్ కుమార్ వివరించారు.
రైతులకు వర్షాధార పంటలే దిక్కుగా మారాయని తెలిపారు. నిత్యం పనుల కోసం వేల మంది..హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని పేర్కొన్నారు. స్థానికంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
ప్రత్యర్థులకు డబ్బు బలం ఉంటే తనకు ప్రజాబలం ఉందని గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణలో 70 స్థానాలకుపైగా కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. వికారాబాద్‌లో భారీ మెజారిటీతో తన గెలుపు తథ్యమని స్పష్టం చేశారు.
.
.