
IT Raids : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి మంచిర్యాలలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు తన కుమారుడు, కూతురు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేవలం కాంగ్రెస్ నేతలనే కావాలని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని కుట్రలు చేసినా చెన్నూర్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని కార్యకర్తలు తెలిపారు.కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలు కొత్తేమి కాదు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై ఇదివరకే ఐటీ దాడులు జరిగాయి.
.
.