
Sabitha Indra Reddy : మహేశ్వరం.. మామూలు రోజుల్లో పెద్దగా ప్రచారంలో కనిపించని నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఇప్పుడు మార్మోగుతోంది. తొలి కారణం.. వరుస విజయాల మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండడం. అప్పటి నుంచి మహేశ్వరంలో వేడి మొదలైంది. తర్వాత ఐటీ సోదాలు ఆ హీట్‌ను పీక్స్‌కు చేర్చాయి. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసాలు, ఫామ్ హౌసుల్లో సోదాలు జరిగాయి. వాళ్లకు దొరికిందేమీ లేదనే చెప్పాలి. కట్ చేస్తే.. డాక్టర్ రెడ్డీస్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ నరేందర్ నివాసాల్లో ఐటీ అధికారులు రెయిడ్స్ చేశారు. వాటికి, ఎన్నికలకు లింక్ లేదని తొలుత అంతా అనుకున్నారు. కానీ.. సబితా ఇంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రదీప్ నివాసాల్లో జరిగిన సోదాల్లో కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఇదంతా మహేశ్వరం అసెంబ్లీ ఎన్నికల్లో పంపకాల కోసం సమకూర్చుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహేశ్వరం నియోజకవర్గాన్ని అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆమెను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉందంటూ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరొక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ ఫేస్ టు ఫేస్ తలపడుతున్నారు. దీంతో మహేశ్వరం పేరు మార్మోగుతోంది.
.
.
.