
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ హ్యట్రిక్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెప్పడంతో.. మరోసారి కేసీఆర్.. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ద్రోహులు అంటూ విపక్షాలపై బహిరంగ సభల్లో విరుచుకుపడుతున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రైతులు, మహిళల్లో బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు.. మేడిగడ్డ బ్యారేజీ ఘటన కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. దీంతో చివరి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ వాడుతున్నారని చర్చ నడుస్తోంది. అశ్వరావుపేట, నర్సంపేటలో కేసీఆర్ కామెంట్స్ చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థం అవుతోంది.
నర్సంపేట సభలో షర్మిలను టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. సమైఖ్యవాదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని ఓడించడానికి షర్మిల డబ్బు కట్టలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పరాయి రాష్టం నుంచి వచ్చిన వాళ్ల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు.
అశ్వారావుపేటలో కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎలా ఉన్నాయో చూడాలని ఓటర్లను సూచించారు. మనతోటి రాష్ట్రం వెనకబడితే..మనం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతీ సభలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుతున్నారు.
Revanth Reddy Comments on KCR: సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ వస్తారా? భయపడేదేలే.. రేవంత్ ఛాలెంజ్..