
KCR : ఎన్నికల ప్రచారంలో ప్రతీ సభలోనూ ధరణి గురించి గొప్పగా చెబుతున్న సీఎం కేసీఆర్… అందులోని అవకతవకలను స్వయంగా బయటపెట్టారు.కేసీఆర్‌కు వాస్తవంగా ఉన్న భూమికన్నా పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఉంది. పట్టాదార్ పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఉందని సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఒప్పుకున్నారు.
ధరణి ఉంటేనే రైతులకు మేలంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న సీఎం కేసీఆర్‌కు.. ఉన్న భూమికన్నా పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి ఎలా వచ్చింది? కేసీఆర్ పాస్‌బుక్‌లో ఎక్కువ ఉన్న ఆ ఒక్క గుంట భూమి ఎవరిది? ఏ రైతు భూమి కేసీఆర్ పాస్‌బుక్‌లో కలిసింది? ధరణి అంతా సక్రమంగా ఉంటే పాస్‌బుక్‌లో ఎక్కువ భూమి నమోదవుతుందా? ధరణి వచ్చిన తర్వాతే కేసీఆర్ పాస్‌బుక్‌లో భూమి పెరిగిందా? ఇప్పుడీ ప్రశ్నలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదంతా ఎవరో చెబుతున్నది కాదు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో ప్రమాణం చేస్తూ.. సీఎం కేసీఆర్ స్వయంగా ఇదంతా చెప్పారు.అఫిడవిట్‌ను అధికారులకు అందజేశారు. ఆ అఫిడవిట్‌లోనే ఈ వివరాలు ఉన్నాయి. అందులోనే తనకు ఒక గుంట భూమి ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
.
.
.