
Madan Mohan Rao : ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు బరిలోకి దిగారు. ఎన్నికలకు సమయం సమీపించడంతో ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. నిత్యం జనంలో ఉంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ అడ్డాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం నుంచి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మదన్ మోహన్ రావు.
ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తానని మదన్ మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో తాను సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచానని స్పష్టం చేశారు. గతంలో సైకిల్ యాత్ర చేశానని తెలిపారు. ఆ సమయంలో 1100 గ్రామాలు 300 తండాలు తిరిగానని గుర్తు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ మోసం చేసి బీఆర్ఎస్‌లోకి వెళ్లారని విమర్శించారు.
కరోనా సమయం నుంచి తన ఆలోచన మారిందన్నారు. ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలనని చెప్పారు. ఈ నియోజకవర్గంలో 95 శాతం మంది రైతులున్నారని తెలిపారు. ఎల్లారెడ్డిలో డ్రైనేజ్ సిస్టమ్ అనేదే లేదన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందుకే తన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.
.
.