
Manda Krishna Madiga : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన సభా వేదికపైకి వచ్చిన సమయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. మందకృష్ణను ఆత్మీయంగా భుజం తట్టి మోదీ ఓదార్చారు. మాదిగ ఉపకులాల సభకు వచ్చినందుకు ప్రధాని మోదీకి మంద కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభా వేదికపై మంద కృష్ణ మాదిగ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దేశాన్ని కాపాడే విషయంలో మోదీ మించిన నాయకుడు లేరని స్పష్టం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలోనూ ప్రధానికి ఎవరూ సాటిరారని తేల్చిచెప్పారు. ఆయన ఇచ్చిన ఏ మాటైనా నిలబెట్టుకుంటారని తెలిపారు. మోదీపై ఆ విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. మాదిగల సభకు మోదీ వస్తారని తాము ఊహించలేదన్నారు.
సమాజం పశువులకంటే హీనంగా మాదిగలను చూసిందని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే చైతన్య పరుస్తున్నామన్నారు. తమ వర్గానికి అండగా ఉండేందుకు వచ్చిన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేవలం మాటలే చెబుతున్నాయని విమర్శించారు. బీజేపీతోనే మాదిగల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ బీజేపీ మాత్రమేనని తేల్చిచెప్పారు. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ మాత్రమే ప్రకటించిందని మంద కృష్ణ చెప్పారు.
మోదీకి సామాజిక స్పృహ ఉండటం వల్లే ఈ సభకు వచ్చారని పేర్కొన్నారు. బలహీన వర్గాల కష్టాలు ఆయన బాగా తెలుసని వివరించారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కతుందని మందకృష్ణ ప్రశంసించారు.
Amabati Rambabu : నాగార్జున సాగర్ వివాదం బాబు వల్లే.. ఏపీ వాటా వాడుకునే స్వేచ్ఛ కావాలి..