
Telangana Elections : తెలంగాణలో ప్రధాని మోదీ ప్రచార జోరును మరింత పెంచింది బీజేపీ. నవంబర్ 7వ తేదీన బీసీ గర్జన సభను భారీ ఎత్తును నిర్వహించిన కమలం పార్టీ.. ఈ రోజు బీజేపీ మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహిస్తోంది. ఈ సభలోనూ ప్రధాని మోదీ పాల్గొని ఎన్నికల ప్రసంగించనున్నారు. అలాగే సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం సభ ప్రారంభంకానుంది. ఈ మేరకు టూర్‌లో భాగంగా ప్రధాని మోదీ సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని సభలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ఆయన ఢిల్లీకి పయనమవుతారు.
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే బీసీ నినాదాన్ని ఎత్తుకుని.. ఏకంగా బీసీనే సీఎంగా చేస్తామని ప్రకటించింది. ఇక ఇప్పుడు ఎస్సీల్లోని మాదిగలు, అందులోని ఉపకులాల మద్దతును కూడగట్టేందుకు మాదిగ విశ్వరూప పేరుతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసింది. ఇక ఇందులో భాగంగానే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఎన్నికల సందర్భంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. సభను విజయవంతం చేసే దిశగా భారీగా జనసమీకరణపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు లక్ష మందిని తరలించే పనిలో మునిగారు పార్టీ శ్రేణులు.
ఎస్సీ ఉప వర్గీకరణపై గత 3 దశాబ్ధాలుగా ఆ సంస్థ పోరాడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా వారికి అనుకూలంగా ప్రకటన చేస్తే ఎస్సీల మద్దతు కూడగట్టుకోవచ్చే వ్యూహంలో ఉంది బీజేపీ. మరోపక్క వర్గీకరణ చేస్తే బీఆర్‌ఎస్ ప్రకటించిన దళితబంధు పథకానికి కౌంటర్ ఇవ్వొచ్చన ఎత్తుగడ కూడా చేస్తోంది. కాగా.. 2018 ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అండగా నిలుస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎస్సీ వర్గీకరణతో బీజేపీ వారికి గాలెం వేసే యోచనలో ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాకుడు మందకృష్ణ మాదిగ కేంద్రహోం మంత్రి అమిత్‌షాను కలిసి ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించని మందకృష్ణ తెలపడం.. ఇవాళ మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహించడం అందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
.
.
.
KTR: ఓటమికి ఫిక్స్ అయ్యారా? ప్రజల దయ ఉంటే గెలుస్తానంటే అర్థం అదేనా?