
Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. బుధవారం సాయంత్రం 4గంటలకు గన్‌పార్క్ నుంచి నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రారంభంకానుంది. నిరుద్యోగులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని యువత కోరుతున్నారు.
నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండ రామ్, రియాజ్, రిటైర్డ్ IAS ఆకునూరి మురళి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈనెల 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యాత్ర సాగనుంది. ఇలా 100 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు యాత్ర సాగనుంది. .
నిరుద్యోగ చైతన్య యాత్ర కోసం 2 బస్సుల ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలు తిరగనుంది. ఒక బస్సు ఉత్తర తెలంగాణ, రెండోది దక్షిణ తెలంగాణకు వెళుతుంది. రోజుకు ఒక్కో బస్సు 5 నియోజకవర్గాలు తిరుగుతుంది. 10 రోజులు 100 నియోజకవర్గాల్లో తిరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.
CM Jagan: పులిహోర మేనిఫెస్టో.. మహానాడు డ్రామా.. బాబుపై జగన్ అటాక్