
Palakurthi Politics : పాలకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోయి.. చేసిన అభివృద్ధి కూడా ఏమీ లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు. దీంతో ఇక తనకు ఓటమి తప్పదని డిసైడై.. ఓటర్లను బెదిరించే కార్యక్రం మొదలు పెట్టారు. ఈసారి తనకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు అన్ని బంద్ చేస్తానంటున్నారు. ఓటు వేసినవారికే పెన్షన్లు, దళితబంధు, డబుల్‌బెడ్ రూం ఇల్లు వస్తాయని.. లేకుంటే ఏదీ ఉండదని బహిరంగంగా చెబుతున్నారు ఎర్రబెల్లి.
అయినా ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపుతామనడమేంటి.. ఇదేమైనా వారి జేబుల్లో నుంచి ఇస్తున్నారా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇక ఎర్రబెల్లి వ్యాఖ్యలతో పాలకుర్తిలో తన ఓటమిని ముందే అంగీకరించారని విమర్శులు వినిపిస్తున్నాయి. పాలకుర్తిలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డికి వస్తున్న జనాదరణతో ఎర్రబెల్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.
ఎన్నికల్లో గెలుపుపై ఆశలు కోల్పోయిన నేతలు ఓటర్లు బెదిరించే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రచారంలో అభ్యర్థులు గతంలో ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధిపై చెప్పుకుంటారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు మాత్రం హామీలను తుంగలోతొక్కి.. అభివృద్ధిని అటకెక్కించడంతో ప్రజలు ప్రశ్నించడం, ఎదురుతిరగడం ప్రారంభించారు. దీంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలు చేసేదేమీ లేక సంక్షేమ పథకాల పేరుతో జనాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమకు ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని లేకుంటే ఏవీ ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదనేది ఆ పార్టీ నేతల ప్రస్టేషన్ చూస్తుంటేనే అర్థమవుతుందంటున్నారు ప్రతిపక్ష నేతలు.