
Rahul Gandhi telangana tour(Political news today telangana):
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు మరింత పెంచింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. పినపాకలో నిర్వహించిన జనసభలో పాల్గొన్నారు. పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందన్నారు. ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తాను స్వయంగా వెళ్లి చూశానని రాహుల్ వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంట్లో మాత్రమే వస్తుందని సెటైర్లు వేశారు.కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఐటీ క్యాపిటల్ గా చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ నేతలు నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవే స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్ అడుగుతున్నారని.. వాళ్లు నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవేనని అన్నారు.
మణుగూరులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. నర్సంపేట సభలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం కోసం ఇవ్వలేదన్నారు.ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు భూములు లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు.