
Telangana Elections : తెలంగాణ ఎన్నికల పోరు రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి హీట్ పెంచుతోంది. ఎలక్షన్ కౌంట్‌డౌన్ దగ్గరపడుతుండటంతో బీర్‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉండటంతో.. ఓటర్లను ఆకర్షించే పనిలో భాగంగా ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే విజయభేరీ సభలతో కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ గాంధీ జోష్ నింపారు. మరోసారి అంతకు రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు ఈ నెల 17 తర్వాత వరుసగా అగ్రనేతలు క్యూ కట్టనున్నారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ రానుండగా.. ఈ నెల 20న ప్రియాంకగాంధీ రానున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో బిజీకానున్నారు. అదే రోజు వరంగల్, పాలకుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాలన్న షెడ్యూల్‌పై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ప్రచారంలో భాగంగా నిరుద్యోగులతో భేటీకానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు కొందరు రెండు బృందాలుగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 10 రోజులపాటు నిరుద్యోగ చైతన్యం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.
ఇక రాహుల్ పర్యటన సమయంలోనే ప్రియాంకగాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 20 తర్వాత సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలోని పలుచోట్ల 5 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. వీరి టూర్ షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లోనే ఖరారుకానుంది.
.
.
.
TSPSC: పేపర్ లీకుకు కేటీఆర్ పీఏకు లింకు!… రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు