
Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. విపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు. అయితే కారుకు బ్రేకులు వేసేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అధికారమే టార్గెట్ గా పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. కాంగ్రెస్‌లో చేరికలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులు.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తెలిసి తిరిగి వస్తున్నారని చెప్పారాయన. కొందరి పేర్లు చెప్పడం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఎవరి స్థాయికి తగిన హోదా వాళ్లకు ఇస్తామని స్పష్టంచేశారు.
ఈ ఎన్నికల్లో మూడింట రెండో వంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించాన్నారు. మహబాబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న సీఎం.. అది నిజమైతే కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. గతంలో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోనే కొడంగల్ నియోజకర్గం ఉందన్నారు. కేసీఆర్ కొడంగల్ లో పోటీ చేయకుంటే.. అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి తాను సిద్ధమన్నారు. తానైనా, మల్లు భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమేనన్నారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగనున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కూడా హస్తినలో ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యారు. వీరంతా శుక్రవారం పార్టీలో చేరబోతున్నారు.
Gautam Adani : ఆ ముగ్గరి వల్లే అభివృద్ధి.. విమర్శలకు అదానీ కౌంటర్..