
Congress Meeting Parakala : పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభకు జనం పోటెత్తారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాలది ప్రత్యేక స్థానంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులిస్తామని హామీ ఇచ్చారు. పరకాలలో ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దుచేస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం కావాలా? దొరల రాజ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. దొరల గడీలపై పేదలకు పోరాడే హక్కు ఇచ్చిందే ఇందిరమ్మ రాజ్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే దళితులు భూములకు యాజమానులయ్యారని తెలిపారు. నేడు తెలంగాణలో దొరల రాజ్యాన్ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కచ్చితంగా ఇచ్చిన హామీలని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు. మార్పుకావాలి.. కాంగ్రెస్ రావాలి.. అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.
.
.
Balakrishna: తొక్కినేని తూచ్.. బాలయ్య తగ్గేదేలే!