Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Telangana BJP : తెలంగాణలో ఎన్నికలలో హంగ్ తీసుకురావడమే బీజేపీ టార్గెట్!

Share this post with your friends

Telangana BJP : తెలంగాణ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం చావో రేవో అనే విధంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ మూడో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. ఇలా ముందుకెళ్తే.. తెలంగాణలో విజయం సాధించడం కష్టమే.. అందుకే కమలం పార్టీ నాయకులు కూడా ఎన్నికల వ్యూహాలు వేరే లక్ష్యంతో రచిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీస్తోందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే.. మరికొందరు బీజేపీ మూడోసారి అధికారంలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి తీసుకురావడనికే మోదీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒక వేళ హంగ్ వస్తే.. బీజేపీ అధికారం చేజిక్కుంచుకుంటామని బీజేపీ నేతలు కొన్ని సందర్భాలు చెబుతున్నారు. అందుకు కారణం బీజేపీ ప్లానింగ్ అని తెలుస్తోంది.

బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీచేసినా ముందుగా ఫోకస్ చేసేది కచ్చితంగా గెలుస్తామని నమ్మకమున్న సీట్లపైనే. మిగతా సీట్లలో బలహీనంగా ఉంటే వాటిని పట్టించుకోదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే ప్లానింగ్‌తో ముందుకువెళుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెలవకపోతే.. ప్లాన్ బి అమలు పరుస్తారు. హంగ్ లాంటి పరిస్థితులు తీసుకువచ్చి కింగ్ మేకర్ లేదా బేరసారాలు జరిపి ఏకంగా కింగ్ కావచ్చు. అందుకోసమే బీజేపీ అన్ని సీట్లు గెలవడం కంటే 23 స్థానాలు గెలుస్తే చాలు. ఆ సీట్లు సాధించి మరో ప్రధాన పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్‌తో బేరసారలు జరిపి అధికారం సాధించే అవకాశాలున్నాయి.

బీజేపీ ఒకవేళ కనీసం 15 సీట్లు సాధించినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దూరమవుతాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో కూడా దీనికోసమే బీజేపీ అనుబంధ పార్టీలైన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ, యువమోర్చా నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

Bigtv Digital

Telangana Elections 2023 : ఎన్నికల పర్వం.. కాకరేపుతోన్న నేతల సవాళ్లు..ప్రతి సవాళ్లు

Bigtv Digital

MLA vs RDO:ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన ఆర్డీఓ.. టిక్కెట్ ఎవరికి ?

Bigtv Digital

Revanth Reddy : కొండంగల్‌లో రేవంత్ నామినేషన్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

Bigtv Digital

Be Alert : ఫేక్ డెలివరీ.. కాల్ ఫార్వార్డింగ్..సైబర్ మాఫియా నయా దందా

Bigtv Digital

Amritpal Singh : అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌.. ఎలా దొరికాడంటే..?

Bigtv Digital

Leave a Comment