
Vijayashanthi latest news(Political news today telangana):
బీజేపీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.
బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించగా విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ఆమె బీజేపీని వీడారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.