
Vijayashanthi : తెలంగాణలో బీజేపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. ఈ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు విజయశాంతి సిద్ధమయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతారని తెలుస్తోంది. విజయశాంతి చేరికను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధ్రువీకరించారు.
తెలంగాణలో బీజేపీకి ఎన్నికల ముందు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మొన్న కోమటిరెడ్డి, నిన్న వివేక్ ఇలా బీజేపీ బడా నేతలు హస్తం గూటికి చేరిపోయారు. అంతకాకుండే కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీపై నమ్మకం లేకపోవడంతో వరుసగా నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడంలేదు. ప్రచారంలోనూ పాల్గొనడంలేదు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం కొన్నిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్నికల ప్రచార టీమ్ లో తొలుత ఆమెకు స్థానంలో కల్పించలేదు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ విజయశాంతి పేరును కూడా ఆ జాబితాలో చేర్చింది. ఈ వ్యవహారంపైనా ఆమె సీరియస్ గానే ఉన్నారని వార్తలు వచ్చాయి. విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారని తాజా పరిణామాలను బట్టి స్పష్టత వచ్చేసింది. తాజాగా మల్లు రవి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరడం ఇక లాంఛనమే.
.
.
.