EPAPER

Farmhouse case: బీజేపీకి హైబీపీ?.. ఇటు మునుగోడు, అటు ఫాంహౌజ్ కేసు..

Farmhouse case: బీజేపీకి హైబీపీ?.. ఇటు మునుగోడు, అటు ఫాంహౌజ్ కేసు..

Farmhouse case: వరుస పరిణామాలు బీజేపీని ఇరకాటంలో పడేసేలా ఉన్నాయి. మునుగోడు ఓటమి కమలనాథుల దూకుడుకు బ్రేకులు వేసింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా.. ఫాంహౌజ్ కేసులో హైకోర్టు తీర్పుతో ఆ కేసు బీజేపీ మెడకు చుట్టుకుంటుందేమోననే అనుమానం వేధిస్తోంది. ఆ ముగ్గురు మధ్యవర్తులతో తమకెలాంటి సంబంధం లేదని రాష్ట్ర నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినా డౌట్లు మాత్రం అలానే ఉన్నాయి. లీకైన ఫాంహౌజ్ వీడియోల్లో పదే పదే అమిత్ షా, బీఎల్ సంతోష్ పేర్లు రావడం.. బీజేపీ ప్రస్తావన ఉండటంతో ముందుముందు ఇబ్బందులు తప్పవేమోననే టెన్షన్.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు జరిపేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. గతంలో విధించిన స్టే ను ఎత్తి వేసింది. మరోవైపు, ఆ ముగ్గురు నిందితుల దగ్గర ఒకటికంటే ఎక్కువ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటరు కార్డులు, వేరు వేరు అడ్రస్ ఫ్రూఫ్స్ ఉండటంతో ఇంకో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా కేసును మరింత పకడ్బందీగా బిగిస్తున్నట్టున్నారు.

ఇక సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ ఆపరేషన్ వీడియోలను, నిందితుల ల్యాప్ టాప్, సెల్ ఫోన్స్ నుంచి సేకరించిన డేటాను.. దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు, అన్నిపార్టీలకు పంపించి.. బీజేపీపై బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు. ఎంతకాదంటున్నా.. ఫాంహౌజ్ లింకులు జాతీయ బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.


తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ గానీ, స్వతంత్ర సంస్థతో గానీ విచారణ జరిపించాలంటూ బీజేపీ రాష్ట్ర నేత ప్రేమేందర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణకు స్వీకరించింది ధర్మాసనం. ఇది మరింత ఆసక్తికర పరిణామం అంటున్నారు. ఒకవేళ కోర్టు కనుక సీబీఐతోనో, సిట్టింగ్ జడ్జితోనో ఎంక్వైరీ చేయించాలని ఆదేశిస్తే.. విచారణ తీరు మారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. స్టేట్ పోలీసులు దర్యాప్తు చేస్తే.. పక్కాగా బీజేపీనే దోషిగా తేలుస్తారనే భావనలో ఉన్నారు కమలనాథులు. అందుకే, ఎందుకైనా మంచిదని జాతీయ సంస్థల విచారణ కోరుతున్నారని అంటున్నారు.

ప్రస్తుతం కేసు దర్యాప్తునకు హైకోర్టు ఓకే చెప్పడంతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. లోతైన విచారణ తప్పక చేస్తారు. ఆ దర్యాప్తు ఎటు తిరిగి ఎక్కడికి వస్తుందోననే టెన్షన్ కమలనాథులకు లేకపోలేదని చెబుతున్నారు.

బూర నర్సయ్య గౌడ్ కు బదులుగా స్వామి గౌడ్, శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ లను లాగేయడం.. మునుగోడు పరాజయం, ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఇలా వరుస పరిణామాలతో బీజేపీకి పొలిటికల్ బీపీ పెరిగిపోతోందని అంటున్నారు.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×